Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ దంపతులు

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (18:38 IST)
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో భారత డిప్యూటీ హై కమిషనర్‌ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వైవీ వెల్లడించారు.

గత  ప్రభుత్వం బడ్జెట్ లోని సింహ భాగం నిధులు కొద్దిమంది ప్రయోజనాల కోసం ఖర్చు పెడితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలు చెల్లించే పన్నులను తిరిగి సామాన్య ప్రజలకే చేర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఎన్‌ఆర్‌ఐలు వైవిధ్యమైన ప్రాజెక్టులతో ముందుకు రావాలని సుబ్బారెడ్డి అభిలషించారు. హెలిన్స్‌బర్గ్‌లోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియా పార్లమెంటును సందర్శించి అక్కడ ప్రజాప్రతినిధుల సభలు నిర్వహించే తీరును పరిశీలించారు. తొలుత ఆస్ట్రేలియా ఉపఖండంలోని తెలుగు ప్రజలు సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డికి ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో అక్కడి వైసీపీ నాయకులు చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, శేఖర్, విశ్వనాథ్, హర్ష, విజయ్, శ్రీధర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments