Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ను కలుసుకున్న ఆస్ట్రేలియా బృందం

జగన్‌ను కలుసుకున్న ఆస్ట్రేలియా బృందం
, గురువారం, 25 జులై 2019 (20:20 IST)
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను చెన్నైలోని ఆస్ట్రేలియా  కాన్సులేట్‌ జనరల్‌ సూసన్‌ గ్రేస్‌ కలుసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన 22 మంది ప్రతినిధులు ఆమె నేతృత్వంలో సీఎంతో గురువారం భేటీ అయ్యారు. గనులు, ఇంధనం, లిథియం బ్యాటరీల తయారీ, విద్య, లాజిస్టిక్స్, విమానాశ్రయాల నిర్వహణల్లో పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు.

రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన ఆస్ట్రేలియా బృందం వివిధ శాఖల మంత్రులను, కార్యదర్శులను, పారిశ్రామిక వేత్తలను కూడా కలుసుకుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఈ సంద‌ర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అందిస్తున్న పారదర్శక పాలన, పారిశ్రామిక రంగానికి మరింత మేలు చేస్తుందని ఆస్ట్రేలియన్‌ బృందంతో సీఎం వ్యాఖ్యానించారు. కాలుష్యం తగ్గించడానికి, మెరుగైన రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను వవేశపెట్టడానికి ఆసక్తితో ఉన్నామని, దానిపై ఆలోచన చేయాలని సీఎం కోరారు.
 
ఆస్ట్రేలియన్ కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయం, ఆహార శుద్ధి, వైద్యం, ఖనిజ తవ్వకాలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఆస్ట్రేలియన్ కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ సుశాన్ గ్రేస్ నేతృత్వంతో కూడిన ప్రతినిధి బృందంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఏయే రంగాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టేందుకు బాగుంటుందో పరిశీలించి ఆ ప్రకారం ముందుకు రావాలని విజ్ణప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ బిడ్ విధానంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని కావున ఈ సదావకాశాన్ని ఆస్ట్రేలియన్ కంపెనీలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని సీఎస్ ఆహ్వానించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పారదర్శక విధానంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వాల్యూ ఎడిషన్ తీసుకురావడం, విద్య, వైద్య రంగాలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 970 కి.మీల సముద్రతీరం ఉందని తీరప్రాంతంలో కొత్తగా మచిలీపట్నం, రామాయపట్నం, ఓడరేవుల్లో పోర్టులను అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున బాక్సైట్, రాయలసీమ జిల్లాల్లో బైరటీస్, సున్నపురాయి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరుపున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. 
 
ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ సుశాన్ గ్రేస్ మాట్లాడుతూ.. వ్యవసాయ మరియు ఆహార శుద్ధి రంగాల్లో ఉత్తమ సాంకేతిక విధానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతులకు తగిన మెరుగైన వాల్యూ ఎడిషన్ అందించేందుకు వీలుగా ఆస్ట్రేలియన్ కంపెనీలు ఇక్కడ ఆహారశుద్ధి యూనిట్లు మరియు రా మెటీరియల్ సోర్సింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

అదే విధంగా పాత ఉత్పత్తి రంగంలో సాంకేతిక సహాయం అందించేందుకు తోడ్పాటును అందింస్తామని తెలిపారు. అదే విధంగా ఖనిజ తవ్వకాల్లో ఆధునిక సాంకేతికపరమైన మైనింగ్ పరికరాలతో కూడిన పరిజ్ఞానం కలిగి ఉన్నామని దానిని రాష్ట్రానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేశ్, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి జె.మురళి, ఆస్ట్రేలియన్ వైస్ కౌన్సిల్ ఆండ్రూ కొలిస్టర్ ఇతర ప్రతినిధులు, ఆస్ట్రేలియాకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్-టాక్‌లో మహిళా పోలీస్ సూపర్ డ్యాన్స్... సస్పెండ్: ప్లీజ్ అంటున్న నెటిజన్స్