Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మంత్రివర్గంలోకి వైకాపా : హుటాహుటిన ఢిల్లీకి సీఎం జగన్!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:44 IST)
కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరనుంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు రావడంతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం హుటాహుటిన హస్తినకు బయలుదేరనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్‌కు అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది. 
 
కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ చేరబోతోందనే ప్రచారం ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. వైసీపీకి 2 కేబినెట్, ఒక సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రధానితో సీఎం జగన్ విపులంగా చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నారు. 
 
మరోవైపు, పలు విషయాలపై మోడీతో జగన్ చర్చించబోతున్నారు. ఇందులో ప్రధానంగా శాసనమండలి రద్దు అంశం కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. 
 
ఇదిలావుండగా, కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరితే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉన్నాయి. బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేన పార్టీ వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ పరిణామం పట్ల జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments