Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీపై అపార విశ్వాసముంది.. హోదా ఇస్తారు : వైకాపా ఎంపీ విజయసాయి

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగుతామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీపై తమకు అపార విశ్వాసం ఉందని చెప్పారు.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (15:52 IST)
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగుతామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీపై తమకు అపార విశ్వాసం ఉందని చెప్పారు. ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని తెలిపారు.
 
తమ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందని, ఏపీకి హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న రాజ్‌దీప్ వ్యాఖ్యలను విజయసాయి కొట్టిపడేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని పేర్కొన్నారు. 
 
బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోడీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటే ఆ పార్టీతో వైసీపీ జత కడుతుందా? అన్న ప్రశ్నకు విజయసాయి మాట్లాడుతూ, హోదా ఇస్తామన్న వారితో కలిసి నడవడమే తమ విధానమని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments