Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీసం మెలేసి.. రాజీనామా చేద్దాం.. రండి: వైకాపా ఎంపీలకు జేసీ సవాల్

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలకలం రేపారు. పార్లమెంట్ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి వైకాపా ఎంపీలపై దూకుడు ప్రదర్శించారు. గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాం

Advertiesment
మీసం మెలేసి.. రాజీనామా చేద్దాం.. రండి: వైకాపా ఎంపీలకు జేసీ సవాల్
, గురువారం, 8 మార్చి 2018 (13:04 IST)
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలకలం రేపారు. పార్లమెంట్ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి వైకాపా ఎంపీలపై దూకుడు ప్రదర్శించారు. గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగిన వైకాపా ఎంపీలకు జేసీ సవాల్ విసిరారు. పార్లమెంట్ గేట్ ముందు నిలబడిన వైకాపా ఎంపీలపై జేసీ మండిపడ్డారు. 
 
వైసీపీ ఎంపీల ముందుకెళ్లిన జేసీ.. వారితో దమ్ముంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీలు మీకు దమ్ము లేదా? అని అడగటంతో.. జేసీ ఆగ్రహంలో వాళ్లను కూడా చేయిపట్టుకుని రాజీనామాలు చేసేందుకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. మీసం మెలేసి తనతో రావాల్సిందిగా చేతులూపారు. ఆపై జేసీ సవాలుకు తాము సిద్ధమేనన్నారు. 
 
అందరూ కలసికట్టుగా ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు అంగీకరిస్తామని తెలిపారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన జేసీ.. అవిశ్వాసం పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. వైకాపాకు చిత్తశుద్ధి వుంటే తెలుగు ప్రజల కోసం పాటుపడుతుంటే.. ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఏదో చేయాలని వైకాపా ఇలాంటి పనులు చేస్తుందని జేసీ విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెల్మెట్ ధరించలేదని.. వెంటబడిన పోలీసులు.. యువతి కిందపడి?