Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు ఎంపీ సీటు మాదే.. న్యాయపోరాటం చేస్తాం : విజయసాయిరెడ్డి

Webdunia
మంగళవారం, 28 మే 2019 (13:38 IST)
గుంటూరు లోక్‌సభ సీటుపై న్యాయపోరాటం చేయనున్నట్టు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ స్థానానికి పోలైన అన్ని ఓట్లను లెక్కించకుండానే ఎన్నికల ఫలితాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారని ఆయన ఆరోపించారు. అందువల్ల న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. గుంటూరు లోక్‌సభ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారు. స్వల్వ సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదు. ఆర్వో అక్రమానికి పాల్పడి తెలుగుదేశం 4200 ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. 
 
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆఖరుకు ఆయన ఓటమిపాలయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఈ స్థానంలో వైకాపా అభ్యర్థి ఓడిపోవడంపై పార్టీ అధినేత జగన్ వద్ద పార్టీ సీనియర్ నేతలు చర్చించారు. ముఖ్యంగా, ఆర్వో అక్రమాలకు పాల్పడి టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని, అందువల్ల న్యాయపోరాటం చేద్దామని కోరడంతో జగన్ సమ్మతించారు. దీంతో గుంటూరు లోక్‌సభ స్థానంపో న్యాయపోరాటం చేయనున్నట్టు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments