Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తినకు జగన్... మోడీతో భేటీ... ప్రత్యేక హోదాపై చర్చించేనా?

Advertiesment
హస్తినకు జగన్... మోడీతో భేటీ... ప్రత్యేక హోదాపై చర్చించేనా?
, ఆదివారం, 26 మే 2019 (08:35 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసం నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. 
 
అయితే, జగన్ మోహన్ రెడ్డి వెంట కేవలం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు మాత్రమే ఉన్నారు. అయితే, మరికొందరు నేతలు మాత్రం శనివారమే ఢిల్లీకి చేరుకుని జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
 
కాగా, ఆదివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకునే జగన్.. ఉదయం 10.40 గంటలకు మోడీతో సమావేశమవుతారు. పిమ్మట ఏపీ భవన్‌కు వెళ్ళి అక్కడ ఏపీ భవన్ అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రానికి ఆయన విజయవాడకు చేరుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ.. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం..