సిఎం రమేష్ ఎనర్జీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు... రోజా సంచలన వ్యాఖ్యలు

మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (16:59 IST)
మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే అవకాశమే లేదన్నారు రోజా. విదేశాల నుంచి వేల రూపాయలు వెచ్చించి ఎనర్జీ ట్యాబ్లెట్లను సిఎం రమేష్‌ కొనుక్కుని వచ్చి వేసుకుంటున్నాడని అన్నారు. 
 
రాత్రయితే ఆ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుంటున్నాడని, సిఎం... రమేష్‌ అనారోగ్యం క్షీణిస్తోందని జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదన్నారు రోజా. తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేస్తే మనిషి పూర్తిగా నీరసించిపోతాడని, కానీ సి.ఎం.రమేష్‌ విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారామె.
 
కేంద్రంపై పోరాడేందుకు అందరినీ కలుపుకుని పోవాలే తప్ప, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments