Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 ఏళ్ల కుర్రాడి దెబ్బకు చంద్రబాబు అడుక్కు తింటున్నాడు: రోజా

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (13:22 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విపక్షనేతనా.. లేదంటే 29 గ్రామాలకు మాత్రమే విపక్ష నేతనా? అంటూ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నుంచి మహిళలను తీసుకొచ్చి నిరసనలు చేయిస్తున్నారని ఆరోపించారు. తల్లి తన బిడ్డలను సమానంగా చూసినట్లుగానే.. జగన్‌ మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
 
 
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి ఎందుకొచ్చారని రోజా ప్రశ్నించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా? అని నిలదీశారు. ఏ అనుభవం ఉందని నారాయణ అధ్యక్షతన కమిటీ వేశారని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్‌రూమ్‌లేనా? అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారని రోజా పేర్కొన్నారు.
 
 
40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకు.. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు ఏనాడైనా జోలె పట్టారా? అని రోజా ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు మహిళలు ఎన్నో బాధలు పడినప్పుడు.. ఈ మహిళలు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆడదానికి రక్షణ కల్పించలేదని రోజా విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments