రాహుల్‌-ప్రియాంకాగాంధీలపై ప్రశాంత్‌ కిషోర్‌ ప్రశంసల జల్లు

సోమవారం, 13 జనవరి 2020 (14:08 IST)
జేడీయూ ఉపాధ్యక్షుడు, వైసిపిప్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీ పార్టీని 2019 ఎన్నికలలో గెలిపించడానికి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయనను నియమించుకున్నారు. వైసిపిని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తన ఎత్తులు పైఎత్తులతో సహాయం చేసారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏపై స్పందించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనకు సారథ్యం వహించిన పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. పొగడ్తతల్లోముంచెత్తారు.
 
ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన నిలిచిన రాహుల్, ప్రియాంక గాంధీల తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య