Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు

Advertiesment
జగన్‌కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు
, బుధవారం, 17 జులై 2019 (19:55 IST)
జగనన్న అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు సైతం వర్తింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం శాసనసభ ఆవరణలో విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 
 
జగనన్న అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. 
 
ముఖ్యంగా బాలికలను పదవ తరగతి  పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నతల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి పథకం ఎంతో భరోసా ఇస్తోందని, బాలికలు సైతం ఉన్నత విద్య చదువుకునేందుకు వీలు కల్పిస్తోందని విద్యార్థులు తెలిపారు. 
 
జగనన్న అమ్మ ఒడి పథకం.. తల్లులకు బంగారు ఒడిగా.. పిల్లలకు చదువుల తల్లిగా మారిందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలోకి రాయపాటి..? బాబుకు వరుస షాకులు...