గుడి, బడి, ఆఖరికి శ్మశానం.. కాదేదీ వైకాపా రంగుకి అనర్హం అంటున్నారు ముఖ్యమంత్రి జగన్. శ్మశానాలతో ప్రారంభించి గుడిని, ఆఖరికి బడిని కూడా వదలడం లేదని తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ విమర్శించారు.
ఈ మేరకు ఈ రోజు ఒక ట్వీట్ లో రైతులకు భరోసా ఇవ్వడానికి మనసు రాక నెలకు రూ.625లే ఇస్తున్నారు, వృద్దులకు పెన్షన్ఇ వ్వడానికి చేతులురాక రూ.250లే ఇస్తున్నారు.ఏమిటిది అంటే.. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న వైకాపా నాయకులు కనిపించిన ప్రతీ దానికీ వైకాపారంగులు వెయ్యడానికి రూ.1300 కోట్ల ప్రజాధనం ఎక్కడ నుండి వచ్చిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు.
విద్యార్థులు దేవాలయంగా భావించే ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో మహామేత విగ్రహాలు, వైకాపా రంగులు వేస్తూ వైకాపా కార్యాలయాలుగా మార్చుకోవడం కంటే దారుణమైన చర్య ఉండదని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.