Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రుల ఆశ‌ల రాజ‌ధానిని నాశ‌నం చేశారు... కొల్లు రవీంధ్ర

ఆంధ్రుల ఆశ‌ల రాజ‌ధానిని నాశ‌నం చేశారు... కొల్లు రవీంధ్ర
, శుక్రవారం, 29 నవంబరు 2019 (16:30 IST)
అధికారంలోకి రాగానే ఆంధ్రుల ఆశల రాజధానిని ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ నాశనం చేసి, రైతుల ఆశలను నీరుగార్చార‌ని తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర వ్యాఖ్యానించారు. తెదేపా జిల్లా కార్యాల‌యంలో శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధానిపై అన‌వ‌స‌ర‌మైన అల్లరి‌ చేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేసే దమ్ము లేక.. మంత్రుల‌ను శిఖండులుగా అడ్డం పెట్టి తిట్టిస్తున్నావా అంటూ సీఎం జ‌గ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 
జగన్ వల్లే ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోయింద‌న్నారు. బ్యాంకులు వెనక్కి పోయాయ‌ని ఆరోపించారు. పనికిమాలిన మంత్రులు భాష వల్ల ఏపి అంటేనే భయపడిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అమ‌రావ‌తిని శ్మశానం అంటున్నార‌ని, అదే శ్మ‌శానం నుంచే పాలన‌ చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు. జిల్లా మంత్రులు ఇద్దరు.. లంబూజంబులుగా త‌యార‌య్యార‌ని ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నానికి ఫైల్ చూడటమే చేతకాద‌ని  ముందు అది నేర్చుకోవాల‌ని సూచించారు. 
 
మరో మంత్రి పేర్ని నాని గ‌తంలో బందరు పోర్ట్ పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం అన్నార‌ని జగన్ అధికారంలోకి వచ్చాక పోర్ట్ పనులు ఆపేస్తే ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న చరిత్ర ఏంటో బందరు వస్తే ప్రజలు చెబుతార‌ని వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించర‌న్నారు. మంత్రులు అందరూ పిచ్చి పుష్పాలుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఒక్కరికి కూడా పద్దతిగా మాట్లాడటం చేతకాద‌న్నారు. 
 
జగన్ చెప్పినట్లు బూతులు తిట్టడమే వీరి పని అని వ్యాఖ్యానించారు. ఖాళీ ఖజానా ఇచ్చారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ నుంచి చంద్రబాబు పాలన ప్రారంభించార‌ని తెలిపారు. రాజధాని విషయంలో రాజకీయాలు మాని అభివృద్ధి చేయాల‌ని సూచించారు. గ‌తంలో చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే నాడు వైయస్ కూడా ఆ పనులు కొనసాగించార‌ని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతాన్ని కులాలకు అంటగట్ట‌డం స‌మ‌జ‌సం కాద‌న్నారు. ఇన్ని కుట్రలు చేయడం‌ అవసరమా అని సీఎం జగన్‌ను ప్ర‌శ్నించారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేలా పనులు చేపట్టాల‌ని కోరారు. రైతుల పక్షాన రాజధాని నిర్మాణం కోసం త‌మ పోరాటం కొనసాగుతుంద‌ని వెల్ల‌డించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడికి సీఎం - డీజీపీలదే బాధ్యత : టీడీపీ