Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క ఫోన్‌ కాల్‌తో అవినీతిపరుల భరతం పట్టేలా చర్యలు : సీఎం జగన్

ఒక్క ఫోన్‌ కాల్‌తో అవినీతిపరుల భరతం పట్టేలా చర్యలు : సీఎం జగన్
, బుధవారం, 27 నవంబరు 2019 (17:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14400 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేసేలా చర్యలు
 తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వెంట మేమన్నామనేలా భరోసా కల్పించాలన్నారు. ఎవరూ లంచాలు తీసుకోకూడదనేలా చర్యలుండాలని కోరారు. 
 
ప్రతీ దశలోనూ అట్టడుగు స్ధాయి వరకూ ఇది ప్రజల్లోకి వెళ్లాలి నా స్థాయిలోనో, అధికారులగా మీ స్థాయిలోనో అవినీతికి నో చెబితే 50 శాతం వరకు పోతుందన్నారు. మిగిలిన 50 శాతం పోయినప్పుడే వ్యవస్ధను ప్రక్షాళన చేయగలుగుతామన్నారు. ఐఐఎం, ఏసీబీ రెండూ కలిసి పనిచేస్తాయన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు వాటిని అవినీతికి తావులేకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉంది. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే ఈ సందేశం అట్టడుగుస్ధాయి వరకూ వెళ్లాలన్నారు. 
 
అలాగే, నవంబరు 20 నుంచి డిసెంబరు 20 వరకు వైయస్‌ఆర్‌ నవశకం. రైస్‌కార్డు, వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డు, వైయస్‌ఆర్‌ ఫెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యాదీవెన - జగనన్న వసతి దీవెన కార్డులు, జగనన్న అమ్మఒడి, వైయస్‌ఆర్‌ కాపునేస్తం, రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్ధిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లుకు ఆర్ధిక సాయం, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ, నేతన్ననేస్తం, లా నేస్తం, ఈ పథకాల లబ్దిదార్ల కోసం (వైయస్‌ఆర్‌ నవశకంపై) సీఎం సమీక్ష నిర్వహించారు. 
 
డిసెంబరు 15 నుంచి 18 వరకు లబ్దిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. డిసెంబరు 20 నాటికి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల తుది జాబితా సిద్ధం చేసి, గ్రామసచివాలయాల ముందు ప్రదర్శించాలన్న సీఎం కోరారు. జనవరి 1 నుంచి కొత్త కార్డుల ముద్రణ, పంపిణీ కార్యక్రమం, సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు, ఎలిఫెంటియాసిస్, ఫెరాలసిస్, మస్క్యులర్‌ ఢిస్ట్రోపీ, క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చే వైయస్సార్‌ ఫెన్సన్‌ కానుక లబ్దిదార్ల జాబితాను రూపొందించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం కోరారు. 
వైయస్‌ఆర్‌ నవశకం మార్గదర్శకాలు చేరని జిల్లాలకు వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించిన సీఎం
అర్హులైన ప్రతి లబ్దిదారుడు లబ్ది పొందాలి, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులు సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో భారీ వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్‌కు ప్రపంచబ్యాంక్ రెడీ