వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం... బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు అవ‌కాశం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏ మండలంలో అయినా జెడ్పీటీసీ, ఎంపీపీ రెండూ స్థానాలు అన్-రిజర్వుడ్ అయితే, ఒక స్థానాన్ని బిసి, ఎస్సీ, ఎస్టీల‌కు  కేటాయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% బిసి,ఎస్సి,ఎస్టీలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇపుడు అద‌నంగా జెడ్పీటీసీ, ఎంపీల‌లో ఓ స్థానాన్ని బిసీ, ఎస్సీ ఎస్టీల‌కు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ పెద్దలకు, ఎమ్మెల్యేలకు సూచించారు.
 
ఇప్పటికే  అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో చాలా జెడ్సీటీసీ స్థానాల‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 25న  ఎంపీపీని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఏకగ్రీవం అయిన జెడ్పీటీసీ  స్థానాన్ని ఇపుడు మార్చేందుకు వీలులేదు. ఎంపీపీ అభ్యర్థిని మార్చేందుకు ఆస్కారం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండూ అన్-రిజెర్వుడ్ ఉన్న చోట్ల ఎంపీపీని  బిసి,ఎస్సి,ఎస్టీలకు కట్టబెట్టబోతోంది వైసిపి.
 
ఈ నిర్ణయం పట్ల పలువురు ఎస్సి, ఎస్టీ, బిసి సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్షం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చారిత్మక నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీపీ, జెడ్పిటిసి రెండు అన్-రిజర్వయిడ్ అయిన‌ మండలాలలో ఎంపిపి పదవిని బిసి,యస్సి,ఎస్టీ వర్గాల వారికి కట్టబెట్టాలని పార్టీ అధినేత గట్టిగా ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విధానాన్ని పాటించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments