Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే... మంత్రి రంగనాధ రాజు రాజీనామా తప్పదా?

Advertiesment
ysrcp
విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:14 IST)
ఏపీలో స్థానిక సంస్థల ముందు సీఎం జగన్ ఈ ఎన్నికలను మంత్రులు..ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవాలని, ఎవరి నియోజకవర్గాల్లో అయినా పార్టీ ఓడితే దానికి బాధ్యత వారిదనేని స్పష్టం చేశారు. అదే విధంగా గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జెడ్పీటీసీలు ఓడినందుకు ఆ ప్రాంతాల్లో మంత్రులుగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాగంటి బాబు, కర్నూలు జిల్లా నుంచి మారప్ప ను కేబినెట్ నుంచి తప్పించారు. అదే విధంగా జెడ్పీటీసీలు ఓడితే జగన్ కేబినెట్ లోని మంత్రులకు అదే వర్తిస్తుందనే ప్రచారం సాగింది.
 
దీనితో ఇపుడు మంత్రి రంగనాధ రాజుతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేల‌లో టెన్షన్ మొద‌లైంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 6 చోట్ల తెదేపా, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చెరో చోట జెడ్పీటీసీలను గెలుపొందారు. అందులో ప్రధానంగా మంత్రి రంగనాధ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట స్థానం ఉంది. అక్కడ వైసీపీ అభ్యర్ధి కడలి గోవిందరాజు పైన టీడీపీ అభ్యర్ధి ఉప్పలపాటి సురేష్ బాబు 2,253 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇక్కడ టీడీపీ - జనసేన పరస్పరం సహకరించుకున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా? లేదా? అనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక, మంత్రితో పాటు, ఓడిన జెడ్పీటీసీల్లో భాగంగా కొద్ది రోజులుగా వివాదస్పదంగా మారిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ జెడ్పీటీసీ కోల్పోయింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్ధి రమణమ్మ గెలుపొందారు.
మరో స్థానం.. మోపిదేవి జెడ్పీటీసీ...ఇక్కడ టీడీపీ నుంచి మల్లిఖార్జున రావు గెలుపొందారు. ఈ జెడ్పీటీసీ స్థానం క్రిష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. అక్కడ సింహాద్రి రమేశ్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలు వైసీపీ కోల్పోయింది. అందులో ఒకటి రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని వర రామచంద్రాపురం. ఈ జెడ్పీటీసీలో టీడీపీ అభ్యర్ధి వల్లా రంగారెడ్డి 849 ఓట్లతో గెలిచారు. అక్కడ ధనలక్ష్మీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే జిల్లాలో కడియంలో జనసేన అభ్యర్ధి మర్గాని అమ్మని గెలుపొందారు.
 
ఈ జెడ్పీటీసీ రాజమండ్రి రూరల్ పరిధిలోకి వస్తుంది. అక్కడ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా.. ఆకుల వీర్రాజు వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. పశ్చిమ గోదావరిలో మరో స్థానం వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం జెడ్పీటీసీని సైతం వైసీపీ కోల్పోయింది. అదే విధంగా..కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ పరిధిలోని గోపవరం జెడ్పీటీసీని టీడీపీ అభ్యర్ధి కలువాయి జయరామి రెడ్డి 104 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు.
 
మంత్రి రంగనాధరాజు తొలి నుంచి జగన్ కు మద్దతుగా ఉన్నారు. కానీ, తాను ఎన్నికల ఫలితాల విషయంలో ఎంత సీరియస్ గా ఉంటానో సంకేతాలిచ్చే క్రమంలో జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకొనే అవకాశం ఉందంటూ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే, ఇప్పుడు ఆచంటలో టీడీపీ జెడ్పీటీసీ గెలవటం ద్వారా మంత్రి రంగనాధ రాజు పైన రఘురామ రాజు లాంటి వారు విమర్శలను ఎక్కు పెట్టటానికి ఇదొక అవకాశంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు బ్రాంచ్ కెనాల్లో ముగ్గురు యువ‌కుల గ‌ల్లంతు