మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై ఏపీ పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. టీడీపీ నేతలే టార్గెట్‍గా ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నకరికల్లు పీఎస్‍లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం ఘటనలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇక టీడీపీ నేతలు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై, నిన్నరాత్రి నుంచి వారి ఇళ్ల వద్దకు వచ్చి పోలీసుల ఆరా తీస్తున్నారు.
తాము ఇచ్చిన ఫిర్యాదుపై యాక్షన్ లేదు కానీ, తిరిగి మాపైనే కేసులు ఎలా నమోదుచేస్తారంటున్న టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై ఏం యాక్షన్ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడు బుద్ధా వెంకన్నపై రాళ్ళు విసిరారని, దీనితో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని, తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.