మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీకి వెళతాం : వైఎస్ జగన్

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (10:07 IST)
మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీకి వెళతామని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగబోతున్న మూడో అసెంబ్లీ సమావేశాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసింది. కూటమి రికార్డు మెజార్టీతో ఘన విజయాన్ని అందుకుంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో తొలి సమావేశాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు.
 
ఇక ఆ తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదంటూ వైసీపీ సభ్యులు సమావేశాలకు డుమ్మా కొట్టారు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హజరు అవుతారా? లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హజరు అయ్యే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
 
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తాముగళం ఎత్తుతామన్న భయంతోనే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం .. వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అటువంటప్పుడు సమావేశాలకు హజరవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హజరు కావడం లేదని స్పష్టీకరించారు. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments