Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన భార్య.. హత్య చేసిన భర్త...

Advertiesment
murder

ఠాగూర్

, శుక్రవారం, 8 నవంబరు 2024 (08:51 IST)
తనకు చెప్పకుండా కుమార్తెకు గ్యాస్ సిలిండర్‌ను భార్య ఇవ్వడాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. దీనిపై భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన భర్త.. భార్యపై దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో దిక్కుతోచని భర్త.. తన భార్య ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిందంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఈ ఘటన ఏపీలోని పెదవూరుపాడు వద్ద జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామ పరిధిలోని దూళ్లవానిగూడెంకు చెందిన వేమూరి వెంకటేశ్వరరావు(72), జయమ్మ(67) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. అయితే, భర్తకు చెప్పకుండా కుమార్తెకు జయమ్మ గ్యాస్‌ సిలిండర్ ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎందుకిచ్చావని భార్య జయమ్మతో వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి ఘర్షణ పడ్డాడు. 
 
ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్య తలను మంచం కోడుకు బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి ఊరు పక్కన గల రైల్వే పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృత దేహాన్ని తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్థులకు ఆనుమానం వచ్చి నిలదీయడంతో సీఎస్‌ఐ చర్చి వద్ద మృతదేహాన్ని వదిలి వెంకటేశ్వరరావు పరారయ్యాడు. 
 
గ్రామస్థులు దుప్పట్లో ఏముందని పరిశీలించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం