Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ ఇపుడు నిజంగానే చనిపోయారు : సీపీఐ రామకృష్ణ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:42 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా ఇపుడు చనిపోయారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి వైఎస్ఆర్ ఆత్మ ఘోషించివుంటుందని చెప్పారు. 
 
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తెలంగాణాలో పోలీసులపై చేయిచేసుకున్న కేసులో వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజున టీవీల్లో కనిపించారని గుర్తుచేశారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబ పరువు పోయిందన్నారు. 
 
ఇవన్ని చూసి వైఎస్ఆర్ నిజంగా ఇపుడు చనిపోయి వుంటారని అన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్క మనశ్శాంతి మినహా మిగిలిన అన్నీ ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణ గత నాలుగేళ్లుగా సాగుతోందని, ఇది మరో యేడాది పాటు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 
తెలంగాణాలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఇది దళితులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన ఆయన ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments