ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడింకానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం పది లక్షల మంది విద్యార్థులు హాజరువుతున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మంత్రి బొత్త సత్యనారాయణ ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు bieap.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే.