Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనేత కార్మికులకు శుభవార్త : 10న మూడో విడత నిధులు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద మూడో విడత నిధులను మంగళవారం జమ చేయనున్నట్టు వెల్లడించారు. 
 
మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేయనున్నారు. ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ.24 వేలు చొప్పున నగదు జమకానుంది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.166.14 కోట్లు నేరుగా 69,225 చేనేత కుటుంబాల ఖాతాలకు జమ చేస్తారు. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
 
నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. 
 
కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్‌గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments