Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు బీమా తరహాలోనే చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ వెల్లడి

Advertiesment
రైతు బీమా తరహాలోనే చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ వెల్లడి
, శనివారం, 31 జులై 2021 (10:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఇకపై రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు కూడా బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని… దానికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపారు. 
 
కాగా, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దళితుల కోసం ప్రత్యేక బీమా సౌకార్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ మేరకు దళిత సంక్షేమ శాఖ కసరత్తులు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చెప్పినట్లు వెల్లడించారు. 
 
'రైతు సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేయడానికి ఏడాది పట్టింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి… అందులో రైతుల వివరాలు సేకరించి జాగ్రత్తగా దాన్ని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం చేనేత కార్మికుల బీమా సదుపాయం కోసం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దళిత సంక్షేమ శాఖ కూడా ఆ ఏర్పాట్లలో ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో చెప్పాం' అని కేసీఆర్ తెలిపారు.
 
తెలంగాణ ఒక ధనిక రాష్ట్రామని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణకు కంపెనీలు వెల్లువలా వస్తున్నాయని వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. మెరుగైన తలసరి ఆదాయాన్ని సాధించుకుంటున్నామని సీఎం గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళంలో విషాదం : స్నానానికెళ్లిన ఇద్దరు జలసమాధి