Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌ది గుండెనా.. బండనా... మనిషివేనని నిరూపించుకో : షర్మిల

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (15:14 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. కేసీఆర్‌ది గుండెనా లేక బండనా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మనిషివేనని నిరూపించుకో కేసీఆర్ అంటూ పిలుపునిచ్చారు. 
 
ఉద్యోగం రావ‌ట్లేద‌ని తీవ్ర నిరాశ‌కు గురైన మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం లింగాపూర్ గ్రామానికి చెందిన భూక్య నరేశ్ (26) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వ‌చ్చిన వార్త‌ను ఆమె పోస్ట్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా 26 ఏళ్ల‌ నరేశ్‌ ను హత్య చేసిన రాతిగుండె కేసీఆర్ ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? ఇప్పటికే వంద‌ల‌ మంది నిరుద్యోగులు చనిపోయారు’ అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
‘ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? వెంటనే రాజీనామా చేసి.. ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో కేసీఆర్’ అని ష‌ర్మిల పేర్కొన్నారు. 
 
ఉపాధ్యాయ ఉద్యోగాల‌ కోత పెడుతున్నార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్యం స‌రిగ్గా అంద‌ట్లేద‌ని కేసీఆర్‌పై ష‌ర్మిల విమ‌ర్శించారు. ‘టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పెనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో.. సర్కార్ విద్యను .. సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్.. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పుడు.. ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు.. పరిపాలన చేయడం చేతకానప్పుడు .. మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్’ అని ఆమె విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments