Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు

Advertiesment
తెలంగాణాలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (10:36 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు విమానాశ్రయాలను నిర్మించనున్నారు. ఇవి నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెన్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్టును ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పూర్తి చేసిందని, ఈ నివేదికను జులై 7న తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సమర్పించిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
 
ప్రతిపాదిత మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు సంబంధించిన స్థల ఎంపిక అనుమతులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర పౌర విమానయానశాఖకు ఇవ్వలేదని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
 
కాగా, అత్యధిక విస్తీర్ణం గల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నికల్ సర్వే బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. విమానాశ్రయం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. 
 
అలాగే, ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంతోపాటు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో సింగరేణి బొగ్గు గనులు, సారపాకలో ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, మణుగూరు-పినపాక మండలాల సరిహద్దులో బీటీపీఎస్ వంటి పెద్ద పారిశ్రామిక సంస్థలకు నిలయంగా భద్రాద్రి కొత్తగూడెం ఉంది. 
 
భద్రాద్రి రాముడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేగాక దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వెలుగు' వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం