Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు చంద్రన్న పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (21:27 IST)
రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వైరం ఉన్నవారు ఒక్కసారిగా ఎలా ఒకరిపై ఒకరు ఏవిధంగా ప్రేమాప్యాయతలు చూపుతున్నారో చూడండి. 
 
వారెవరో కాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడమే కాకుండా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. ఏమో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో గానీ ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రం శత్రువులు మిత్రులుగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments