Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకే చంద్రబాబును కేటీఆర్ మునగ చెట్టు ఎక్కించేశారట...

ఉప్పు, నిప్పుగా ఉండే టిఆర్ఎస్, టిడిపి నాయకులు ఈమధ్యకాలంలో స్నేహ గీతాలను అందుకుంటున్నారు. తెలంగాణా వెనుకబాటుకు చంద్రబాబే కారణమన్న నేతలు కాస్తా ఇప్పుడు అదే చంద్రబాబును పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. ఏకంగా ఆ పార్టీ యువరాజు, కెసిఆర్ కొడుకు కెటిఆర్ చం

Advertiesment
KTR Praising Chandrababu Naidu
, సోమవారం, 18 డిశెంబరు 2017 (16:53 IST)
ఉప్పు, నిప్పుగా ఉండే టిఆర్ఎస్, టిడిపి నాయకులు ఈమధ్యకాలంలో స్నేహ గీతాలను అందుకుంటున్నారు. తెలంగాణా వెనుకబాటుకు చంద్రబాబే కారణమన్న నేతలు కాస్తా ఇప్పుడు అదే చంద్రబాబును పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. ఏకంగా ఆ పార్టీ యువరాజు, కెసిఆర్ కొడుకు కెటిఆర్ చంద్రబాబును ఓ రేంజ్‌లో పొగిడారు. హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందంటే దానికి కారణం ఆ రోజుల్లో చంద్రబాబు చేసిన కృషేనన్నారు కెటిఆర్. అంతటితో ఆగలేదు... చంద్రబాబు పాలనా పటిమతో హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుందని ఆకాశానికి ఎత్తేశారు. 
 
అయితే కెటిఆర్ ఇలా మాట్లాడటం చాలామందికి ఆశ్చర్యం అనిపించినా అసలు విషయం తెలిసిన వారు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణం వచ్చే ఎన్నికల్లో టిడిపి, టిఆర్ఎస్‌ల పొత్తు ఖాయం అనే సంకేతాలు రావడమే ఇందుకు అసలు విషయంగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడానికి ఇదే రీజన్ అంటున్నారు ఇరుపార్టీల నాయకులు. 
 
ఎలాగో ఇక తెలంగాణాలో పాగా వేయడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేసిన చంద్రబాబు తెలంగాణాలో పనులు కావాలంటే కెసిఆర్ సహకారం తప్పనిసరని భావిస్తున్నారట. మరోవైపు టిఆర్ఎస్ కూడా ఇక తెలంగాణాలో టిడిపి పని అయిపోయిందన్న భావనకు వచ్చేయడంతో ఇక బాబుని పొగిడినా, తిట్టినా పెద్దగా లాభం లేదని అనుకుంటున్నారట. అందుకే కెటిఆర్ తన వ్యాఖ్యలతో చంద్రబాబును మునగచెట్టు ఎక్కించేశారంటున్నారు అసలు విషయం తెలిసినవారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు లైవ్ : హిమాచల్ పోల్ అంతిమ ఫలితాలు