Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక 'చేతి'లో మిగిలింది ఐదు రాష్ట్రాలే ... 'కాషాయం' ఖాతాలో 19

దేశంలో కాంగ్రెస్ పట్టు కోల్పోతుందా? ఒకపుడు ఏ రాష్ట్రంలో చూసిన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే ఇపుడే ఎటు చూసినా కాషాయం కనిపిస్తోంది. తాజాగా వెలువడిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలుపుకోగా, హిమాచల

ఇక 'చేతి'లో మిగిలింది ఐదు రాష్ట్రాలే ... 'కాషాయం' ఖాతాలో 19
, సోమవారం, 18 డిశెంబరు 2017 (15:36 IST)
దేశంలో కాంగ్రెస్ పట్టు కోల్పోతుందా? ఒకపుడు ఏ రాష్ట్రంలో చూసిన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే ఇపుడే ఎటు చూసినా కాషాయం కనిపిస్తోంది. తాజాగా వెలువడిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలుపుకోగా, హిమాచల్ ప్రదేశ్‌ను తన వశం చేసుకుంది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఇంటికి పంపించారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య దేశంలో 19కు చేరగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య 5కి పడిపోయింది. ఇతరులు ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు.
 
ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 29 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మిజోరామ్, మేఘాలయ, పుదుచ్చేరి సహా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ చేజారిపోవడంతో ఇక ఆ పార్టీ కేవలం ఐదుకు రాష్ట్రాలకే పరిమితమైంది. అదేసమయంలో బీజేపీ పాలించే రాష్ట్రాల సంఖ్య 19కు చేరింది. 
 
బీజేపీ పాలిత రాష్ట్రాలను పరిశీలిస్తే, జమ్మూకాశ్మీర్ (పీడీపీ - బీజేపీ కూటమి ప్రభుత్వం), హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, గోవా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి అధికారంలో ఉన్నాయి. 
 
కేరళలో లెఫ్ట్ పార్టీలు, తమిళనాడులో అన్నాడీఎంకే, తెలంగాణలో తెరాస, వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, త్రిపురలో లెఫ్ట్, ఒడిషాలో బీజేడీలు అధికారంలో ఉన్నాయి. 

ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాల్లో 19 బీజేపీ పాలనలోనే ఉన్నాయి. ఇది ఓ రికార్డు. గతంలో ఏ పార్టీ కూడా ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో లేదు. 24 ఏళ్ల కిందట కాంగ్రెస్ అత్యధికంగా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 1993లో మొత్తం 26 రాష్ట్రాల్లో 15 కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేవి. ఒకటి సంకీర్ణ ప్రభుత్వం కాగా.. మరో రెండు కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు తెలిపిన సీపీఎం ప్రభుత్వాలు. మళ్లీ ఇన్నాళ్లకు 19 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ లేదా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్రౌపది తొలి ఫెమినిస్ట్... మొండి పట్టుదల వల్లే మహాభారత యుద్ధం