Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#GujaratVerdict : మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి ఖాయం

గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా, మొత్తం 182 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 92 స్థానాల్లో గెలుపొందాల్

#GujaratVerdict : మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి ఖాయం
, సోమవారం, 18 డిశెంబరు 2017 (10:52 IST)
గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా, మొత్తం 182 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 92 స్థానాల్లో గెలుపొందాల్సి వుంది. ప్రస్తుతం బీజేపీ ఇక్కడ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో బీజేపీ మరోమారు ప్రభుత్వ ఏర్పాటు తథ్యంగా కనిపిస్తోంది. 
 
నిజానికి సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో గుజ‌రాత్‌లో బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య హోరాహోరీగా పోటీ సాగింది. అయితే, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను మాత్రం బీజేపీ సొంతం చేసుకోనుంది. క‌నీసం వంద స్థానాల్లో బీజేపీ విజ‌యం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. 
 
మొద‌ట్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌.. ప్ర‌స్తుత ట్రెండ్స్‌లో మ‌ళ్లీ వెనుక‌బ‌డింది. ఇప్ప‌టికే 107 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది. ప్ర‌స్తుత ట్రెండ్స్ చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యేలానే క‌నిపిస్తున్నాయి. అయితే మోడీ సొంత జిల్లా మెహ‌సానాలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండ‌టం విశేషం. 
 
ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యంగా కనిపిస్తోంది. బీజేపీ 38, కాంగ్రెస్ 23, ఇతరులు ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 35 సీట్లు కావాల్సి ఉంది. మొత్తం సీట్లు 68. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు లైవ్ : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు క్లిక్ చేయండి