Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంజయ్ కాకడే జోస్యం నిజమవుతుందా?.. ఆ ఎంపీ బీజేపీ ఆక్టోపసా?

గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురయ్యేలా వుంది. గుజరాత్‌లో బీజేపీనే గెలుస్తుందని.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ కోడై కూస్తున్నాయి. అయితే గుజరాత్‌లో అయినా అక్కడ గెలిచేది కాంగ్రెస్‌నే అని ఓ

Advertiesment
BJP MP
, సోమవారం, 18 డిశెంబరు 2017 (09:08 IST)
గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురయ్యేలా వుంది. గుజరాత్‌లో బీజేపీనే గెలుస్తుందని.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ కోడై కూస్తున్నాయి. అయితే గుజరాత్‌లో అయినా అక్కడ గెలిచేది కాంగ్రెస్‌నే అని ఓ ఎంపీ జోస్యం చెప్పారు. అయితే ఆ ఎంపీ బీజేపీకి చెందిన వాడు కావడం మరో విశేషం. ఎగ్జిట్ పోల్స్ అవాస్తవమని, తమ పార్టీ ఓడిపోనుందని ఎంపీ సంజయ్ కాకడే అన్నారు. దీంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తరహాలో సంజయ్ కాకడే బీజేపీ ఆక్టోపస్ అని చర్చ సాగుతోంది. 
 
ఇంకా కాకడే మాట్లాడుతూ.. తాను జరిపించిన సర్వేలో 75 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా నిలిచారని వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఓబీసీలు, పటేళ్లు, ముస్లింలు, దళితలు కాంగ్రెస్ వైపు నిలిచారని, అందుకే  కాంగ్రెస్ పార్టీని విజయం వరిస్తుందని సంజయ్ చెప్పేశారు. ఈయన జోస్యం నిజమయ్యేలా సోమవారం ఎన్నికల ఫలితాల్లో గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో వుంది. 
 
అయితే అన్ని ప్రధాన మీడియా సంస్థలు, సర్వే సంస్థలు గుజరాత్‌లో మరోసారి బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి. ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ కకాడే మాత్రం.. బీజేపీ విజయం సాధించే అవకాశమే లేదన్నారు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా గుజరాత్‌లో బీజేపీ కష్టాలు తప్పవని చెప్పారు. అక్కడ తమ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని కకాడే అన్నారు. 
 
182 అసెంబ్లీ స్థానాల్లో సంపూర్ణ మెజారిటీ గురించి తర్వాత.. కనీసం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు (92) కూడా వచ్చే అవకాశం లేదని ఉద్ధవ్ ఠాక్రే జోస్యం చెప్పారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో తాను ఏకీభవించడం లేదని ఉద్దవ్‌ ఠాక్రే తేల్చిచెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ పోల్స్ రిజల్ట్స్ : బీజేపీ హవా... ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు