పర్వతశ్రేణి ప్రాంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 18వ తేదీన విడుదల కానున్నాయి.
, సోమవారం, 18 డిశెంబరు 2017 (17:53 IST)
పర్వతశ్రేణి ప్రాంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. బీజేపీ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు కావాల్సి ఉంది. కాగా భాజపా 44 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 21 చోట్ల, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు.