కర్నూలు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:53 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాకు ఆయన విచ్చేయనున్నారు. ఇక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా ఓ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం జగన్ వస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అధికారంగా ఓ ప్రకటన చేశారు. దీంతో సీఎం జగన్ పర్యటన కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు... 
 
మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. ఆ తర్వాత ఉదయం పది గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 
 
ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11.15 గంటలకు గుమ్మటం తండా హెలిప్యాడ్‌కు హెలికాఫ్టరులో వస్తారు. ఓ 15 నిమిషాల పాటు స్థానిక నేతలతో మాట్లాడుతారు. 
 
ఆ తర్వాత 11.35 గంటలకు రోడ్డు మార్గంలో ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత 11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 
 
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు చేరుకుని 12.50 గంటలటకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు. ీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments