Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22 నుంచి ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన - నేడు కర్టన్‌రైజర్

Advertiesment
22 నుంచి ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన - నేడు కర్టన్‌రైజర్
, గురువారం, 12 మే 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22వ తేదీ నుంచి దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రుల బృందం హాజరుకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఏయే అంశాలను చర్చించాలి, ఏయే రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలనే అంశంపై సీఎం జగన్ గురువారం సచివాలయంలో కర్టన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 
 
దీనికి ఏపీ ఆర్థికశాఖామంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌తో సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశం కోసం సచివాలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా? ఆ 22 గదులలో ఏముంది?