ప్రత్యేక హోదా లేనట్టేనా? ఢిల్లీలో జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారు?

Webdunia
ఆదివారం, 26 మే 2019 (15:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎండమావిగా మారనుంది. తన ప్రమాణ స్వీకారోత్సానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన వైకాపా అధినేత, నవ్యాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశం ఒక్కటే కాదు.. రాష్ట్రానికి అనేక ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయన్నారు. 
 
అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం వదిలిపెట్టబోనని స్పష్టంచేశారు. వాస్తవానికి ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి 250 సీట్లుగాని వచ్చివున్నట్టయితే ఖచ్చితంగా వారికి మన మద్దు అవసరం ఉండేది. అపుడు ప్రత్యేక హోదాపై సంతకం చేస్తానంటేనే మద్దతు ఇస్తామని షరతు విధించేవాళ్ళం. 
 
కానీ, ఇపుడు ఏ ఒక్కరి అవసరం లేకుండానే కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పాటు కానుంది. అందువల్ల  ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని మోడీని పదేపదే అడుగుతూనే ఉంటాం. అడక్కుంటే మాత్రం ఈ అంశం ఇంతటితో మరుగునపడిపోతోంది. ప్రత్యేక హోదా అనేది మన హక్కు అని చెప్పుకొచ్చారు.
 
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సింగిల్‌గా 303 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి కలిపి మొత్తం 353 సీట్లు వచ్చాయి. దీంతో ప్రధాని మోడీ రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments