ముస్లిం దంపతుల బిడ్డకు నరేంద్ర మోడీ పేరు...

ఆదివారం, 26 మే 2019 (11:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో ఓ ముస్లిం దంపతులకు పుట్టిన బిడ్డకు ప్రధాని నరేంద్ర మోడీ పేరును పెట్టారు. గత ఐదేళ్ళ కాలంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు, పాలనా దక్షతకు ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన బిడ్డకు మోడీ పేరును పెట్టుకుంది. ఈ ఘటన గోండా జిల్లా పర్సాపూర్ మహ్రౌర్ గ్రామంలో జరిగింది. 
 
ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ సఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయదుందుభి మోగించారు. అదే రోజు తనకు బిడ్డ పుట్టడంతో మోడీ పేరును పెట్టుకున్నట్టు ఆ మహిళ తెలిపింది. కుటుంబ సభ్యులు, దుబాయ్‌లో ఉన్న భర్త వద్దని వారించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపింది. 
 
చివరకు ఎట్టకేలకు మైనాజ్ బేగంతో ఏకీభవించిన ఆమె కుటుంబ సభ్యులు బాలునికి నరేంద్ర మోడీగా నామకరణం చేసి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ట్రిపుల్ తలాక్ నిషేధంపై చర్యలు తదితర నిర్ణయాలు తనను ఆకర్షించాయని బేగం చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నిన్ను చూసి గర్వపడుతున్నాం జగన్... జగన్ క్లాస్‌మేట్స్