ప్రేమించలేదనే అక్కసు.. కారుతో ఢీకొట్టిన ఉన్మాది

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (15:04 IST)
ప్రేమించలేదనే అక్కసుతో యువతిని కారుతో ఢీకొట్టాడు ఓ ఉన్మాది. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 
 
దారుణమైన ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆగస్టు 1న చోటుచేసుకుంది. కంబదూరు మండలం బోయలపల్లి వద్ద స్కూటీపై వస్తున్న యువతిని ప్రేమోన్మాది కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. బుక్కరాయ సముద్రం మండలం అమ్మరాజుపేట గ్రామానికి చెందిన గుజ్జల భాస్కర్.. అదే గ్రామానికి చెందిన గుజ్జల మైథిలిని ప్రేమించాలని వెంటబడ్డాడు. పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. వరుసకు అన్నయ్య కావడంతో మైథిలి అతడి ప్రేమను నిరాకరించింది. 
 
అతడి వేధింపుల భరించలేక మైథిలి తల్లి కళ్యాణదుర్గానికి బదిలీ చేసుకుంది. దీంతో ఆమెపై అక్కసు పెంచుకున్న భాస్కర్.. ఆమెపై హత్యాయత్నం చేశాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయం కుంబదూరు మండలం బోయలపల్లి సబ్-స్టేషన్ వద్ద స్కూటీతో వస్తుండగా కారుతో ఢీకొట్టాడు.
 
ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలు కాగా.. భాస్కర్ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బాధితురాలి మైథిలి ప్రస్తుతం కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భాస్కర్ అన్న వరుస కావడంతో ప్రేమకు నిరాకరించినట్టు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments