Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంకిపాడులో ఇద్దరు బాలికల అదృశ్యం

Advertiesment
Missing
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. స్థానిక జడ్పీటీసీ పాఠశాలకు చెందిన ఈ బాలికలు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. వీరిద్దరినీ అదే గ్రామానికి చెందిన గుండి జోజి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ అదృశ్యమైన బాలికల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తుంటాడు. స్థానికంగా ఆర్క్‌ వెల్డర్‌గా పనిచేసే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక బాబు ఉండగా పది రోజుల క్రితం పాప జన్మించిందని పోలీసులు తెలిపారు. 
 
విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాలికలు అక్కడి నుంచి జోజితో కలిసి జనశతాబ్ది ట్రైన్‌లో చెన్నై వైపు వెళ్లినట్టు గుర్తించారు. వీరి కోసం 20 బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 ఏళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారయత్నం..