Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కు టిక్కెట్ ఇస్తే పోటీ చేయను : ఎంపీ వేమిరెడ్డి

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (17:38 IST)
నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు సీటిస్తే తను ఎంపీగా పోటీ చేయబోనని వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెగేసి చెప్పారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా నెల్లూరు రాజకీయాలపై సమీక్షించారు. నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా ఆదాలను నియమించినందున వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని వేమిరెడ్డిని సీఎం కోరగా... తాను పోటీ చేసేందుకు సుముఖంగా లేనని వేమిరెడ్డి తెగేసి చెప్పారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చేందుకు వీల్లేదని షరతు విధించారు. 
 
అనిల్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో ఓడిపోతారని, ఆ ప్రభావం లోక్‌సభ స్థానంపై పడుతుందని వేమిరెడ్డి చెప్పగా.. ఈ అభిప్రాయంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఏకీభవించారు. అలాగే, సీఎం జగన్‌తో భేటీ తర్వాత కూడా నెల్లూరు లోక్‌సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పోటీచేయడంపై స్పష్టత రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments