Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ సీజన్-7లో ఆంధ్రా క్రికెటర్.. పోటీదారులు వీరేనా?

Advertiesment
big boss
, బుధవారం, 19 జులై 2023 (18:35 IST)
వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-7 త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై అత్యంత వినోదాత్మకంగా సాగే షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా షో ఏడో సీజన్‌కు సిద్ధమైంది. 
 
తాజాగా ఈ షోకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. బిగ్ బాస్ 7 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టిన పోటీదారులు ఎవరు? అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరగనుంది. 
 
ఇదిలా ఉంటే ఈ సీజన్‌కు సంబంధించి ఓ వార్త ట్రెండింగ్‌లో ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు వేణుగోపాలరావు బిగ్ బాస్ 7 తెలుగు హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఆయన్ను హౌస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
సాధారణంగా గతంలో బిగ్ బాస్ హౌస్‌లోకి సినీ, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీలు రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి మాత్రం టీమిండియా తరఫున ఆడిన క్రికెటర్ పేరు చెబితేనే ఆశ్చర్యం కలుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 
ఓ మాజీ క్రికెటర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే ఈ సీజన్ క్రేజ్ పెరగడం ఖాయం. గత రెండు సీజన్‌లుగా ఈ రియాల్టీ షోకి పెద్దగా ఆదరణ లభించలేదు. వేణుగోపాలరావు భారత్ తరఫున 16 వన్డేలు ఆడాడు. 2005లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన వేణుగోపాల్ అదే ఏడాది వెస్టిండీస్‌తో తన చివరి వన్డే ఆడాడు.
 
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పోటీదారుల జాబితా వివరాలు
ఈటీవీ ప్రభాకర్ (నటుడు)
నిఖిల్ (యూట్యూబర్)
సాయి రోనక్ (నటుడు)
విష్ణు ప్రియ (నటి)
ఢీ పాండు (కొరియోగ్రాఫర్)
అమర్‌దీప్ చౌదరి (నటుడు)
మహేష్ బాబు కాళిదాసు (నటుడు)
సిద్ధార్థ్ వర్మ (నటుడు)
సాకేత్ కొమండూరి (గాయకుడు)
జబర్దస్త్ అప్పారావు (హాస్యనటుడు)
మోహన భోగరాజు (గాయకుడు)
శోభా శెట్టి (నటి)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమా గా గోపీచంద్ - కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి