Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల‌లా త‌యారైన వైసీపీ నేతలు: న‌క్కా ఆనంద్ విమ‌ర్శ‌

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (15:37 IST)
తాలిబన్‌ల మాదిరిగా వైసీపీ నేతలు ఏపీలో పని చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. తాము కూడా అధికారంలో ఉన్నామని...ఏ రోజు పోలీసు సిబ్బందితో ఇలాంటి పనికిమాలిన పనులు చేయించలేదని అన్నారు.

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులు చేస్తుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మేరుగ నాగార్జున అట్రాసిటీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

అట్రాసిటీ చట్టం ఎత్తివేయించేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. గాలివాటంగా వచ్చిన నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు పరామర్శిస్తుంటే వైసీపీ నేతలను పోలీసుల ఎలా తీసుకువస్తారని నిలదీశారు. అధికార పార్టీ నేతల వద్ద మార్కులు కోసం పోలీసులు పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో పేకాట , గుట్కా, మద్యం విచ్చలవిడిగా సాగుతుందని తెలిపారు. జిల్లా పోలీసుల అధికారుల అవినీతిలో కూరుకపోయారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పోలీసు వచ్చి పేకాట శిబిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసులకు సిగ్గు చేటన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని, ఈ పోలీసు అధికారులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments