తెలంగాణా ఈసెట్‌ ఫలితాల‌ విడుదల, 95.16 శాతం పాస్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (15:31 IST)
పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు రాసిన తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3న జరిగిన ఈసెట్‌కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ పక్రియ ప్రారంభం కానుంది. 24 నుంచి 28 వరకు స్లాట్‌ బుకింగ్‌, 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.

ఈ నెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబరు 2న ఈసెట్‌ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. సెప్టెంబరు 13న తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది.

సెప్టెంబరు 14న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్‌ సీట్లను కేటాయిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments