రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి భారీ విజయానికి ప్లాన్ వేసిందే ప్రశాంత్ కిషోర్. వ్యూహకర్తగా పదునైన ఆలోచనతో వైసిపికి భారీ మెజారిటీని తెచ్చిపెట్టారు. కేవలం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని తనదైన శైలిలో ప్రజల్లోకి వైసిపిని వెళ్ళేలా చేసి విజయాన్ని సాధించారు.
అందుకే ప్రశాంత్ కిషోర్ అంటే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డికి బాగా ఇష్టం. కోట్ల రూపాయలు ప్రశాంత్ కిషోర్‌కు ఇచ్చినా అధికారం తనకు వచ్చిందన్న ఆనందం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ కీలకంగా మారబోతున్నారట.
అందుకు ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నాడట. ఏకంగా కేంద్రంలోని బిజెపి పెద్దలతోనే ప్రశాంత్ కిషోర్ జగన్‌ను సిట్టింగ్‌లో కూర్చోబెట్టి రహస్య ఒప్పందాలు కూడా చేసినట్లు తెలుస్తోంది.
మోదీ వ్యతిరేక కూటమి ఒక్కటవుతోంది. దీంతో మోదీ ఇరుకున పడిపోతున్నారంటూ ప్రచారం బాగానే సాగుతోంది. దీంతో వ్యతిరేక కూటములను ఎదుర్కోవాలంటూ కొన్ని పార్టీ ఎంపిలయినా సఖ్యతగా, సన్నిహితంగా చేసుకోవాలి కదా. కాబట్టి అందులో వైసిపిని కూడా భాగస్వామ్యులు చేస్తున్నారట ప్రశాంత్ కిషోర్.
బిజెపికి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయాలని.. వ్యతిరేక శక్తుల కూటమితో పోరాటం చేయాలని కూడా బిజెపి ముఖ్య నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి జగన్ ఏమాత్రం ఒప్పుకోవడం లేదట. ఇప్పటికే ఎపిలో కొంతమంది మంత్రులు బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
అసలు ఎలాంటి ఒప్పందం లేకుండా బిజెపితో ఎందుకు సఖ్యతగా ఉండాలి. వారిని ఇరుకునపెడుతున్న వ్యతిరేక పక్షాలపై మనం ఎందుకు పోరాటం చేయాలి అన్నది జగన్ ఆలోచనట. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇలా చేస్తే బిజెపికి బాగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రం సపోర్ట్ ఎక్కువగా మీ రాష్ట్రానికి అవసరమన్న విషయాన్ని చెప్పుకొచ్చారట ప్రశాంత్ కిషోర్. దీంతో పూర్తిగా ఆలోచనలో పడిపోయారట ఎపి సిఎం. మరి ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలంటున్నారు.