Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ప్రభుత్వాలకు ఎన్నికల ఆంక్షలు వర్తించవా? యనమల రామకృష్ణుడు

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (12:48 IST)
కేంద్ర ఎన్నికల సంఘంపై ఆర్థికశాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. భారత రాజ్యాంగం కంటే ఎన్నికల సంఘం గొప్పదా అంటూ ఆయన ప్రశ్నించారు. పైగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ.. పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలకే ఎన్నికల సంఘం ఆంక్షలను వర్తింపజేస్తోందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న వ్యక్తికాదు. ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నియమించిన సీఎస్.. స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్‌లో నియామకం జరిగింది. అలాంటిది పరిధి దాటి సీఎస్ వ్యవహరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నిస్తున్నారు. 
 
ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే ప్రస్తుత సీఎస్ పరిమితమన్న ఆయన.. పరిధి దాటి సీఎస్ వ్యవహరించడాన్ని ఎలా చూడాలి..? అంటూ ఫైర్ అయ్యారు. ఇక బీజేపీయేతర ప్రభుత్వాలపై ప్రధాని నరేంద్ర మోడీ వివక్షత పరాకాష్టకు చేరుకుందని ఆరోపించారు. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 
 
ప్రభుత్వం లేకుండా గవర్నెన్స్ గురించి ఏ రాజ్యాంగం చెప్పింది..? అని ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు రాజ్యం చేయవచ్చని ఎక్కడైనా చెప్పారా..? రాజ్యాంగం కంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అతీతమా..? ప్రజాస్వామ్యానికే భంగం కలిగేలా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఈసీ విడుదల చేయవచ్చా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి ఆంక్షలు లేవు.. కేంద్ర కేబినెట్ సమావేశాలు చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను పని చేయనివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలకే ఎన్నికల సంఘం ఆంక్షలా..? అంటూ ప్రశ్నించిన ఆయన... కేంద్రంలో ఎక్కడా కేబినెట్ సెక్రటరీ జోక్యం చేసుకోవడం లేదు. కానీ, ఏపీలో ఈసీయమించిన సీఎస్‌ జోక్యం చేసుకోవడం ఏంటి? అని యనమల నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments