Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:12 IST)
రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకి చెందిన ప్రవీణ నిండు గర్భిణీ. రామేశ్వరం నుంచి తిరుపతిలో ఉన్న పుట్టింటికి అమ్మ, అమ్మమ్మతో కలిసి రైలులో బయలుదేరింది. రైలు పాకాలకు సమీపంలోకి రాగానే ప్రవీణకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 
 
బోగీలో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు పురుషులను పక్క బెర్తులోకి పంపి.. బోగీలోని కిటికీలను మూసివేసి.. ఎవరూ కనిపించకుండా చీరలు కట్టారు. పురిటి నొప్పులు వచ్చిన 15 నిమిషాల్లో ముంగిలిపట్టు వద్దకు రైలు చేరుకోగానే పండంటి మగబిడ్డను ప్రసవించింది. 
 
రైలు తిరుపతికి చేరుకునే లోపు 108కు సమాచారం అందించారు. 108 పైలెట్ చంద్రబాబు రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంకు చేరుకుని రైల్వే పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో 108 వాహనంలోకి తీసుకెళ్లారు. స్టేషన్‌ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి... అనంతరం ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments