దొంగను పట్టుకుబోయిన వ్యక్తి.. రైలులో చిక్కుకుని..?

బుధవారం, 10 జులై 2019 (11:47 IST)
దొంగను పట్టుకుబోయిన వ్యక్తి రైలులో చిక్కుకుని దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన షకీల్ షేక్ (53). ఇతడు జోగేశ్వరి నుంచి చర్చ్ గేట్ వరకు జర్నీ చేసేందుకు రైలు ఎక్కాడు. 
 
అతని పక్కన నిల్చున్న ఓ యువకుడు.. షకీల్ మొబైల్ ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. రైలు నుంచి దిగిపోయాడు. వెంటనే తేరుకున్న షకీల్, దొంగను పట్టుకునేందుకు రైలు నుంచి ఉన్నట్టుండి కిందకు దూకాడు. కానీ అదుపుతప్పి కిందపడిపోయాడు. 
 
దీన్ని చూసిన ప్రయాణీకులు అతనని కాపాడేందుకు పరుగులు తీశారు. కానీ రైలు పట్టాలపై పడిన షకీల్.. రైలు చక్రాలకు బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పరారీలో వున్న దుండగుడి కోసం గాలిపు చర్యలు చేపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మెడలో మూడు ముళ్లు వేశాడు.. అక్కడ సంతృప్తి పరుస్తున్నాడు... ఇంతకన్నా ఏంకావాలి?