Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ వర్సెస్ కివీస్ : వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్..(video)

Advertiesment
India
, మంగళవారం, 9 జులై 2019 (19:05 IST)
భారత్, న్యూజీలాండ్ మధ్య ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయేటప్పటికి న్యూజీలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. వర్షం తగ్గకపోతే రిజర్వ్ డే అయిన జులై 10న మ్యాచ్ కొనసాగనుంది. కానీ, ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయినా భారత్ ఫైనల్‌కు చేరడంలో ఎలాంటి సందేహం ఉండదు. 
 
అందుకు కారణం.. లీగ్ దశలో న్యూజీలాండ్ కంటే భారత్ ముందుండడమే. లీగ్ దశలో భారత్‌కు 15 పాయింట్లు ఉండగా, న్యూజీలాండ్‌కు 11 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప్రాతిపదికగా భారత్ ఫైనల్‌కు చేరుతుంది. న్యూజీలాండ్ తన అయిదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో గ్రాండ్‌హామ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 10 బంతుల్లో 2 ఫోర్లలో 16 పరుగులు చేశాడు. 
 
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో న్యూజీలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 41వ ఓవర్ చివరి బంతికి నీషమ్ భారీ షాట్‌కి యత్నించగా దినేశ్ కార్తీక్ దాన్ని క్యాచ్ పట్టడంతో నాలుగో వికెట్ పడింది. నీషమ్ 18 బంతుల్లో ఒక ఫోర్‌తో 12 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో చాహల్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 95 బంతులను ఎదుర్కొన్న విలియమ్సన్ 6 ఫోర్లతో 67 పరుగులు చేశాడు.
 
అంతకుముందు ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతికి హెన్నీ నికోలస్ క్లీన్ బౌల్డ్ కావడంతో న్యూజీలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. నికోలస్ 51 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు సాధించి అవుటయ్యాడు. న్యూజీలాండ్ స్కోర్ 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 133. 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన న్యూజీలాండ్. 
 
30 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి న్యూజీలాండ్ 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకం పూర్తయింది. 29 ఓవర్లు ముగిసేటప్పటికి న్యూజీలాండ్ 105 పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసేటప్పటికి న్యూజీలాండ్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. 8 ఓవర్లలో న్యూజీలాండ్ స్కోర్ వికెట్ నష్టానికి 69 పరుగులు. 14 ఓవర్లలో న్యూజీలాండ్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. 13 ఓవర్లు ముగిసేసరికి న్యూజీలాండ్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. 11 ఓవర్లు ముగిసేసరికి న్యూజీలాండ్ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది.
 
అంతకుముందు... న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఆటగాళ్లు మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్ ఓపెనింగ్ జోడీగా బరిలో దిగారు. భారత్ బౌలింగ్ దాడిని పేసర్ భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా ప్రారంభించారు. నాలుగో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో గుప్తిల్ అవుటయ్యాడు. భువనేశ్వర్ వేసిన తొలి బంతి బ్యాట్స్‌మన్ కాలికి తాకడంతో ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. అంపైర్ అవుటివ్వకపోవడంతో భారత్ రివ్యూ కోరింది. థర్డ్ అంపైర్ కూడా నాటవుట్‌గానే నిర్ణయం ప్రకటించారు.
 
రెండు ఓవర్లు ముగిసేసరికి న్యూజీలాండ్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఇద్దరు బ్యాట్స్‌మన్లూ ఖాతా తెరవలేకపోయారు. మూడో ఓవర్ అయిదో బంతికి తొలి పరుగు సాధించారు. మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజీలాండ్ వికెట్ కోల్పోకుండా ఒక పరుగు మాత్రమే చేసింది. నాలుగో ఓవర్లో గుప్తిల్ వికెట్ కోల్పోయింది. అయిదు ఓవర్లు ముగిసేసరికి 7 పరుగులు చేసింది. అనంతరం న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ పుంజుకొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ హామీలు అమలు చేయండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి