Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ - మచిలీపట్నంలో టెన్షన్.. టెన్షన్

Webdunia
ఆదివారం, 3 మే 2020 (09:48 IST)
ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ తారా స్థాయిలో ఉంది. ఫలితంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరింది. అయితే, ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలైన విజయవాడ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడినవారికి రక్షించేందుకు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. 
 
అయితే, మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌లో ఉంచిన ఓ మహిళ సిబ్బంది, అధికారుల కన్నుగప్పి పారిపోయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మిస్సింగ్ అయిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
చిలకలపూడి క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ అయిందన్న వార్త మీడియాలో ప్రసారం కావడంతో స్థానికుల్లో ఆందోళనమొదలైంది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ సర్కారు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments