నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... నెల్లూరు ఉదయగిరిలో నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు.
గురువారం ఉదయం 32 గ్రాముల నకిలీ బంగారపు గొలుసు ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్నారు. అయితే జ్యుయెల్లరీ షాపు వాళ్లు అది అసలు బంగారం అని భావించి.. మోసపోయారు. ఆపై నకిలీ బంగారం అని తెలిసి తలపట్టుకున్నారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.