Webdunia - Bharat's app for daily news and videos

Install App

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

ఐవీఆర్
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (18:55 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్డీయే నేతలు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి అభివాదం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి మోడీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర ఆగారు. హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి, మీరు చేయాల్సిన పని ఇంకా చాలా వుంది. అది చేసాక వెళ్లవచ్చు అనడంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ అభివాదం చేసారు.
 
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరయ్యారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను హృదయపూర్వకంగా పలకరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాన్ని సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments