Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ రివర్స్... రూ.7.20 లక్షలు కొట్టేసింది.. పెళ్లి చేసుకుని జంప్

Woman
Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (20:45 IST)
సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటివరకు అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిల కథలను వినేవుంటాం. కానీ ఇక్కడ ఓ యువతి ప్రేమ పేరిట అబ్బాయిని మోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలో పెళ్లి పేరుతో యువకుడిని ఓ యువతి మోసం చేసింది. 
 
అమెరికాలో ఉంటున్న తెనాలి యువకుడికి ఆమె గాలం వేసింది. మ్యాట్రిమోనిలో ''మైనేని సముద్ర'' పేరుతో యువతి పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త పెళ్లిదాక వెళ్లింది. ఇంకేముందు పెళ్లిపీటల మీద కూర్చోవాలని యువకుడు ముచ్చటపడ్డాడు.
 
ఇద్దరు పెళ్లికి ముహూర్తాన్ని కూడా ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి పెళ్లి హైరానా మొదలైంది. పెళ్లి ఖర్చుల కోసం యువతి, యువకుడి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. పెళ్లి షాపింగ్‌ కోసం రూ.7.20 లక్షలు తన అకౌంట్‌లో యువతి వేయించుకుంది. 
 
పెళ్లి మోజులో పడ్డ అబ్బాయి.. ఆగమేఘాలమీద భారత్‌కు వచ్చాడు. ఆ వెంటనే పెళ్లి చేసుకునేందుకు యువతి ఊరికి వెళ్లాడు. ఇంకేముందు యువకుడిని మోసం చేసి ఆమె పరారైంది. దీంతో ఆ యువకుడు ఉసూరుమంటు పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments